HYD: ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల నియామకం చేయాలని అశోక్ అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దాదాపు 9, 10 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టడంతో ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీమంత్రి జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉస్మానియా ఆసుపత్రిలో అశోక్‌ని పరామర్శించి, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.