E.G: జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. ఇవాళ రాజమండ్రిలోని కలెక్టరేట్లో పర్యాటక శాఖ సమన్వయంతో హౌస్ బోట్స్, క్రూయిజ్ అభివృద్ధి అంశాలపై ఆమె సమావేశం నిర్వహించారు. గోదావరి తీరం, ప్రకృతి సౌందర్యం, కడియం నర్సరీలు పర్యాటకులను ఆకర్షించే శక్తి ఉందని వెల్లడించారు.