ఖమ్మం నగరంలో ఈనెల 26న వీరనారి చాకలి ఐలమ్మ, 27న కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారిణి జ్యోతి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు, అటు ఖమ్మం లకారం ట్యాంకుబండ్ వద్ద బాపూజీ జయంతి వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.