GNTR: వెలగపూడి సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన DSC ఉద్యోగ నియామక పత్రాల జారీ సభా ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. రాకపోకల మార్గాలు, స్టేజీ, భారీ కేడింగ్ నిర్మాణం, సీటింగ్ ఏర్పాట్లు వంటి అంశాలను సమీక్షించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రత, బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు.