NRML: కుంటాల మండల కేంద్రంలో మున్నూరు కాపు కుల సంఘ భవన నిర్మాణానికి ఇటీవల విడుదలైన రూ. 5 లక్షల నిధుల గురించి ధన్యవాదాలు చెప్పేందుకు కుంటాల గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘ సోదరులు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన ఈ నిధులు మంజూరు చేయగా, ఇటీవల అవి విడుదలయ్యాయి.