ADB: నార్నూర్ మండలంలో మంగళవారం రూ.4 లక్షల 40 వేల విలువైన గంజాయి పట్టుకున్నట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. స్థానిక విజయనగర్ కాలానికి చెందిన కినక జుగాదిరావు తన కౌలుకు తీసుకున్న వ్యవసాయంలో గంజాయి సాగు చేస్తున్నాడు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయగా 44 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు.