W.G: వ్యవసాయ సాగులో రైతులు అతిగా యూరియా వాడటం ద్వారా పంటపై చీడ పీడల ప్రభావం ఎక్కువగా ఉంటుందని మార్టేరు వ్యవసాయ సహాయ సంచాలకుడు ఎంవి రమేష్ అన్నారు. అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏవో రాజేష్ అధ్యక్షత వహించారు. యూరియాకి ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడుకోవాలని తెలిపారు.