ప్రకాశం: జిల్లాలో అర్ధరాత్రి భూమి కంపించింది. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల 53 నిమిషాలకు భూమి కంపించినట్లు ఒంగోలు ప్రజలు తెలిపారు. ఈ భూకంప ప్రభావం అధికంగా ఒంగోలులోని శర్మా కళాశాల ప్రాంతంలో ఉగిందన్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా భూ ప్రకంపనతో భయాందోళనకు గురయ్యామన్నారు. చివరికి అది భూకంపం అని తెలిసినట్లు ప్రజలు వివరించారు.