మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారీగా వరదలు సంభవించడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ధారాశివ్ జిల్లాలో వర్ష ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. వరదల్లో చిక్కకుపోయినవారిని హెలికాప్టర్లు, పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. నాలుగైదు రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో 975.05 మి.మీ వర్షాపాతం నమోదైంది.