MHBD: డోర్నకల్ నియోజకవర్గ రాజకీయాల్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ప్రజా నాయకుడు నూకల నరేష్ రెడ్డి విగ్రహం వద్ద ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, BRS మాజీ MLA డిఎస్ రెడ్యానాయక్ ఇద్దరూ కలిసి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఒకే వేదికపై ఇద్దరు నేతలు పక్కపక్కనే నిలవడం స్థానికుల్లో ఆసక్తి రేకెత్తించింది. ఈ ఐక్యత వాతావరణాన్ని మార్చివేసింది.