TPT: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నాగులచెరువులో మంగళవారం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు వెంకటపేటంకు చెందిన మునిరాజా(40)గా గుర్తించారు. ప్రమాదవశాత్తు పడ్డాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్నకోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.