KMM: పాలేరు సెగ్మెంట్లో మిషన్ భగీరథ కార్మికుడిగా పనిచేస్తున్న చందనబోయిన గాంధీ(35) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడని, వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.