ఇంగ్లండ్‌కు చెందిన లెజెండరీ అంపైర్ డిక్కీ బర్డ్(92) కన్నుమూశారు. ఈ మేరకు ఆయన బ్యాటర్‌గా ప్రాతినిధ్యం వహించిన యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్ ఓ ప్రకటన విడుదల చేసింది. తొలి 3 వరల్డ్ కప్ టోర్నీలతో పాటు 66 టెస్టులు, 69 వన్డేలు, 7 మహిళల వన్డేలకు ఆయన అంపైర్‌గా చేశారు. ఆయన మృతి పట్ల పలువురు క్రికెటర్లు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.