KKD: చిన్ననాటి నుంచే తీవ్రమైన ఆరోగ్య సమస్యతో మంచానికే పరిమితమైన 14 ఏళ్ల బాలుడు ప్రేమ్ ప్రాణాలను కాపాడేందుకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ముందుకు వచ్చారు. వైద్యుల సూచన మేరకు ప్రేమ్‌కు నిరంతర ఆక్సిజన్ అవసరం కావడంతో, సతీష్ బాబు తన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల విలువగల ఆక్సిజన్ కాన్సంట్రేటర్ స్వయంగా అందించి బాలుడికి ఊపిరి పోశారు.