JGL: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ‘డిజిటల్ అరెస్ట్’ అనేది పూర్తిగా సైబర్ మోసం మాత్రమేనని స్పష్టం చేశారు. పోలీసులు, సీబీఐ అధికారులమని చెబుతూ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారని వివరించారు. ఇలాంటి కాల్స్‌కు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించవద్దని సూచించారు.