ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ అవార్డులు ప్రకటించిన విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, నటి రాణీ ముఖర్జీ, విక్రాంత్ మస్సే, ఇతర భాషల నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.