ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. త్వరలో వందే భారత్ రైళ్లలో స్లీపర్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఒక రైలు సిద్ధమైందని.. అక్టోబర్ 15 నాటికి మరో రైలు పట్టాలెక్కనుందని తెలిపారు. రెండో రైలు వచ్చిన తర్వాతే రెగ్యులర్ సర్వీసులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.