సత్యసాయి: జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ను కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సంక్షేమం, అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కుటుంబాల పిల్లల విద్య సహా సమస్యలు పరిష్కారానికి సహకరిస్తానని తెలిపారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.