కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి దేవాలయంలో రెండవ రోజు మంగళవారం, అమ్మవారు శ్రీ గాయత్రి అవతారంలో దర్శనమిచ్చారు. నవరాత్రులలో భాగంగా వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.