NLR: తోటపల్లి గూడూరు మండలంలోని వరిగొండ రైతు సేవా కేంద్రంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారి పి.సత్యవాణి యూరియా వాడకం పై రైతులకు అవగాహన కల్పించారు. ఎకరాకు రెండున్నర నుంచి మూడు బస్తాలు యూరియా మూడు నుంచి నాలుగు దఫాలుగా సరిపోతుందన్నారు. అధికంగా యూరియా వాడకూడదని సూచించారు.