WGL: పట్టణ కేంద్రంలో మంగళవారం BSF ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మార్వాడి గో బ్యాక్ జేఏసీ వ్యవస్థాపకులు డా. పిడమర్తి రవిని నల్గొండ పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని రాజేందర్ ఖండించారు. రవిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.