GNTR: జిల్లాలో కలరా కేసులు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెనాలి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు మంగళవారం సూచించారు. వాంతులు, విరేచనాలను నిర్లక్ష్యం చేయవద్దని, ఆర్ఎంపీల దగ్గరకు వెళ్లకుండా వెంటనే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలన్నారు. తాగునీటి ద్వారా కలరా వేగంగా వ్యాపిస్తుందని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని ఆయన సూచించారు.