KKD: నవరాత్రి మహోత్సవాల రెండవ రోజు సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ సహచర మహిళా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో కలిసి ప్రత్యేక వస్త్రాల అలంకరణలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షించారు.