VKB: తాండూరులో హెచ్ఐవీ/ఎయిడ్స్ అవగాహన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, దిశ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హెచ్ఐవీ నిర్మూలనకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హెచ్ఐవీ సమాచారం కోసం 1097 హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయవచ్చని ఆయన తెలిపారు.