సత్యసాయి: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో శక్తి టీం బృందాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఆర్టీసీ బస్టాండ్ వంటి ప్రజాబాహుళ్య ప్రాంతాల్లో పోక్సో చట్టాలు, శక్తి యాప్, డయల్ 100, 112, 1091, 1098, 181, 1930 సేవలపై వివరించారు. ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, ప్రేమ పేరుతో మోసాలు, మహిళల జరిగే నేరాలపై జాగ్రత్తలు తెలియజేశారు.