TPT: స్వచ్ఛ భారత్ సాధనకు గాంధీ ఆశయాలను కొనసాగించాలని తిరుపతి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ,పీజీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ పిలుపునిచ్చారు. మంగళవారం కళాశాలలో NSS దినోత్సవం వేడుకగా జరిగింది. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థినులు సమాజసేవలో భాగం కావాలన్నారు. ఒక ఊరిని దత్తత తీసుకుని పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ గూర్చి ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు.