KMM: నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను తయారు చేసి రైతుల నుంచి డబ్బులు దండుకున్న ముఠాను కూసుమంచి పోలీసులు అరెస్టు చేశారు. జక్కేపల్లికి చెందిన అంజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్త జీవన్‌రెడ్డి, బయ్యారానికి చెందిన కార్తీక్, పాల్వంచకు చెందిన సాయి కుషాల్, లక్ష్మీదేవిపల్లి వరప్రసాద్, సారపాకకు చెందిన లక్ష్మణ్‌లను అరెస్టు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.