పవన్ కళ్యాణ్ OG మూవీలో రాహుల్ రవీంద్రన్ ఉన్నట్లు ఇప్పటికే పలు క్లిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ సినిమాలో రాహుల్ ‘భద్ర’ అనే పాత్రలో నటిస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే ధీనానాథ్ పాత్రలో హరీశ్ ఉత్తమన్ నటిస్తున్నట్లు మరో పోస్టర్ను ట్వీట్ చేశారు.