NTR: కృష్ణానదిలో వరద నీటి ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 3,98,294 క్యూసెక్కులుగా నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. కృష్ణా ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ కు 8,242 క్యూసెక్కులు, కృష్ణా వెస్ట్రన్ మెయిన్ కెనాల్‌కు 5,527 క్యూసెక్కులు విడుదల చేశారు. సర్ ప్లస్ జలాలు 3,84,525 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు.