PPM: జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డిని మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో 104 జిల్లా మేనేజర్ ఎస్ కృష్ణ కలిశారు. జేసీ మాట్లాడుతూ.. వన్ జీరో ఫోర్ వాహనాలు ఎన్ని ఉన్నాయి..? వాటి పరిచర్య ఎలా ఉంది గిరిజనులు అందుతున్న వైద్యముపై ఆరా తీశారు. ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా మేనేజర్‌ను జేసీ ఆదేశించారు.