E.G: ఆరోగ్య రంగానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను ప్రభుత్వం చెల్లించిందన్నారు. అలాగే బలబద్రపురంలో క్యాన్సర్ కేసులు వస్తున్నాయని, నియోజవర్గంలో క్యాన్సర్ కేర్ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్నారు.