మహబూబ్నగర్ నియోజకవర్గం కోడూరు గ్రామానికి చెందిన కొండ ఆంజనేయులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ వీ. శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు. ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.