నెల్లూరు: వరికుంటపాడు మండలం తూర్పుకొండారెడ్డిపల్లి రామాలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. మంగళవారం సాయంత్రం పూజలు చేసిన అనంతరం ఆలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. గుర్తుతెలియని దుండగులు లోపలికి ప్రవేశించి ఆలయంలో ఉన్న హుండీతో పాటు శ్రీఆంజనేయ స్వామి వెండి విగ్రహం, నాలుగు వెండి కిరీటాలు రెండు తాళిబొట్లు చోరీకి గురైనట్లు స్థానికులు బుధవారం గుర్తించారు.