BDK: కొత్తగూడెం టౌన్ పంజాబ్ గడ్డకు చెందిన మధుసూధన్(41) బాత్రూంలో కాలుజారి కిందపడి మృతి చెందాడు. మధుసూదన్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనికి వెళ్లేందుకు స్నానం చేయడానికి బాత్రూంకి వెళ్ళగా జారీ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని గొంతుకు తీవ్రగాయం అయింది. వెంటనే 108కు ఫోన్ చేసి స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.