GDWL: అయిజ పట్టణంలో శాంతి భద్రతలను కాపాడటానికి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను నియంత్రించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని బీజేపీ అయిజ పట్టణ అధ్యక్షుడు కంపాటి భగత్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి అయిజ ఎస్సై తరుణ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. శాంతిభద్రతలకు భంగం కలగకూడదన్నారు.