అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామానికి చెందిన TDP సీనియర్ కార్యకర్త కొప్పల లక్ష్మయ్య బుధవారం లారీ ఢీకొని మృతి చెందారు. వివరాల్లోకెళ్తే కడప నుండి లక్కిరెడ్డిపల్లికి బైక్పై వస్తుండగా, గువ్వలచెరువు గాట్ వద్ద టాయిలెట్ కోసం పక్కకు వెళ్లినప్పుడు అదుపు తప్పిన లారీ ఢీకొట్టింది. కాగా, లక్ష్మయ్య అక్కడికక్కడే మరణించగా, ఆయనతో పాటు ఉన్న కొప్పల ఈశ్వరయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.