WGL: GWMC 15వ డివిజన్ పరిధి మొగిలిచెర్లలో బుధవారం సహకార సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేయర్ గుండు సుధారాణితో కలిసి పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహిళా సంఘాల అధిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు.