W.G: రాష్ట్ర శాసనసభలో బుధవారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రసంగించారు. ఏపీ చేపల పెంపకం అభివృద్ధి ప్రాధికార సవరణ చట్టంపై ఆయన మాట్లాడారు. పశ్చిమ, తూర్పు, కృష్ణా, నెల్లూరు జిల్లాలు ఆక్వా రంగంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఆక్వా సాగు ఎక్కడెక్కడ జరుగుతుందో లెక్కలు లేవన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీని రైతులకు అందించలేకపోతున్నామన్నారు.