SKLM: వృద్ధుల వేధింపులపై అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇలిసిపురం ఖ్యాతి వృద్ధాశ్రమంలో సదస్సు జరిగింది. ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో కార్యదర్శి కె.హరిబాబు వృద్ధులకు హక్కులు, చట్టాలు, ప్రభుత్వ పథకాలను వివరించారు. ఖ్యాతి వృద్ధాశ్రమ ప్రతినిధి శ్రావణి పాల్గొన్నారు.