ADB: తలమడుగు మండలంలో కంటైనర్ అదుపు తప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. మంగళవారం మండలంలోని సుంకిడి,లింగి మధ్య అంతర్ రాష్ట్ర రహదారిపై అతి వేగంతో ప్రయాణిస్తున్న సిమెంట్ మిల్లర్ కంటైనర్ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లడంతో లారీ ఇంజన్ ఊడి పోయి ముందు భాగంలో పడింది. చాక చక్యంగా డ్రైవర్ తప్పించుకొని వెళ్ళిపోయాడని స్థానికులు తెలిపారు.