లక్నో వేదికగా IND- A, AUS- A మధ్య జరుగుతున్న రెండో అనధికార టెస్ట్ తొలిరోజు ఆట ముగిసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 350/9 రన్స్ చేసింది. నాథన్ మెక్‌స్వీనీ(74), జాక్ ఎడ్వర్డ్స్(88) అర్థ శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 5 వికెట్లతో విజృంభించగా.. గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.