E.G: బాల్యవివాహాల నివారణ, మాదకద్రవ్యాల ప్రభావం, న్యాయపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ధవళేశ్వరంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాలు సమాజానికి కలిగే హానులు, చట్టపరమైన శిక్షల గురించి వివరించారు.