ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని అమరావతిలోని కలిశారు. ఆలయాల పునర్నిర్మాణానికి సహకరించాలని వినతి పత్రం అందజేశారు. నగరంలోని కాశీవిశ్వేశ్వర-కోదండరామ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు చేయాలని కోరారు. అన్ని ఆలయాల అభివృద్ధికి సహకరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.