ASR: హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాల జీవో నెంబర్లు 13, 51 వెంటనే రద్దు చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాలదేవ్ కోరారు. ఈనెల 27వ తేదీన హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ మజ్జివలస గ్రామంలో అరణ్య గర్జన సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు ప్రకటన చేయాలన్నారు.