WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు పండగ సెలవుల సందర్భంగా ఇవాళ వరంగల్ CP సన్‌ప్రీత్ సింగ్ ముఖ్య హెచ్చరికలు జారీ చేశారు. ఇంటికి సెంట్రల్ లాక్, సెక్యూరిటీ అలారం ఏర్పాటు చేయాలన్నారు. ఊరు వెళ్ళే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆభరణాలు బ్యాంక్ లాకర్లో భద్రపరచాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు చైన్ లాక్ వేయాలని, సీసీ కెమెరాలతో ఇంటిని గమనించాలని తెలిపారు.