RR: స్నేహితులతో సరదాగా గడిపేందుకు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కత్వా జలాశయం వద్ద ఫొటోలు దిగుతూ ప్రమాదవశాత్తు నీళ్లలో పడి బేగంపేట రసూల్‌పురాకు చెందిన కామ సాయి తేజ(17) ఆదివారం సాయంత్రం గల్లంతైన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బందితో గాలింపు చేపట్టారు. సాయి తేజ కోసం 48 గంటలుగా గాలిస్తున్నా అతడి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.