MDK: వెల్దుర్తి మండల వ్యాప్తంగా సబ్సిడీ వ్యవసాయ పనిముట్ల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ సూచించారు. FM SMAM పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ చేస్తున్నామని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొత్తం 139 రకాల పనిముట్లపై ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.