VZM: బొండపల్లి మండలంలోని చామలవలస గ్రామపంచాయతీని మంగళవారం డీఎల్పీవో శిరీషరాణి తనిఖీ చేశారు. పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగాయని అదే గ్రామానికి చెందిన బోదంకి అప్పలనాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ నిమిత్తం రికార్డులు తనిఖీ చేశారు. ఇందులో ఫిర్యాదుదారు బోదంకి అప్పలనాయుడు, సర్పంచ్ రమణమ్మ డిప్యూటీ ఎంపీడీవో రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు.