నిన్న విడుదలైన ‘కాంతార 1’ ట్రైలర్ అభిమానులను అలరిస్తోంది. రిలీజైన 24 గంటల్లోనే ఈ ట్రైలర్ ఏకంగా 107 మిలియన్ల డిజిటల్ వ్యూస్ పొందింది. ఈ మేరకు మూవీ టీమ్ స్పెషల్ పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ మూవీ అక్టోబర్ 2న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.