కోనసీమ: నవోదయం కార్యక్రమం ద్వారా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 8 మండలాల్లోని 29 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా ప్రకటించినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ కార్యక్రమంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సారా రహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్ఎ మాధవి పాల్గొన్నారు.